అమెరికాలో 'పచ్చ పీతల నుంచి విస్కీ' తయారీ..
దిశ, ఫీచర్స్ : అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన ‘టామ్‌వర్త్ డిస్టిలింగ్’ సంస్థ అసాధారణమైన పదార్థం నుంచి విస్కీ తయారు చేస్తోంది.
దిశ, ఫీచర్స్ : అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన 'టామ్‌వర్త్ డిస్టిలింగ్' సంస్థ అసాధారణమైన పదార్థం నుంచి విస్కీ తయారు చేస్తోంది. ఇందుకోసం ఇన్వాసివ్ క్రాబ్ జాతికి చెందిన గ్రీన్ క్రాబ్స్(ఆకుపచ్చ పీత) వినియోగిస్తోంది. 'కస్టమ్ క్రాబ్, మొక్కజొన్న, మసాలా' మిశ్రమంతో నిండిన బోర్బన్ బేస్'తో ఈ విస్కీ తయారవుతోంది. ఈ పద్ధతిని సంస్థ యజమాని స్టీవెన్ గ్రాస్ వివరించారు. విస్కీ డెవలపర్లు 40 కిలోలకు పైగా చిన్న చిన్న పీతలను 'క్రాబ్ స్టాక్'గా ఉడకబెట్టిన తర్వాత వాటిని అంతర్గత తటస్థ ఆల్కహాల్ ఉపయోగించి రోటరీ వాక్యూమ్‌లో తయారు చేస్తారని తెలిపారు. దీని టేస్ట్ 'బ్రౌనీ అండ్ బెటర్ ఫైర్‌బాల్' మాదిరిగా ఉంటుందని తెలియజేశారు.
క్రాబ్ విస్కీ ఎందుకు తయారు చేస్తున్నారు?
యూరోపియన్ 'గ్రీన్ క్రాబ్' అనేది క్రస్టేసియన్ (నీటిలో సంచరించే) ఆక్రమణ జాతి. అయితే ఇది ఈశాన్య అమెరికా, న్యూ ఇంగ్లాండ్ ప్రాంత సముద్ర తీర పర్యావరణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. ఈ మేరకు క్రమంగా పెరిగిపోతున్న పచ్చ పీతల సంఖ్యను అదుపు చేసేందుకు.. టామ్‌వర్త్ డిస్టిల్లింగ్ 'NH గ్రీన్ క్రాబ్' ప్రాజెక్ట్‌తో జతకట్టింది. ఈ సంస్థ స్థానికులకు కలిగే ముప్పును వ్యాపార అవకాశంగా మార్చేందుకు 'డెకాపాడ్స్' ప్రవర్తనను పరిశోధిస్తోంది. ఇదిలా ఉంటే.. 'ఆహ్లాదకరమైన, ఆసక్తికర విధానంలో పర్యావరణ సమస్యలపై సమాజానికి అవగాహన పెంచుతున్నాం. క్రియేటివిటీతో కూడిన ఈ తయారీ.. ఇబ్బందికర అంశాలను కూడా టేస్టీ ట్రీట్‌గా మార్చగలదని చూపిస్తున్నట్లుగా స్టీవెన్ చెప్పారు.
We then fortified the stock with our house-made Neutral Grain Spirits, and distilled it to achieve crab essence. The spirit's taste has been aptly compared to a "briny Fireball." Its bourbon base is steeped with a custom crab, corn and spice blend likened to a Low Country Boil. pic.twitter.com/w50So7OUOL
— Tamworth Distilling (@tamworthdistill) May 19, 2022