ప్రియుడి HIV రక్తాన్ని ఎక్కించుకున్న ప్రియురాలు ఎక్కడంటే?

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం యువతి, యువకులు ప్రేమలో పడటం విడిపోవటం మామూలు విషయం అయిపోయింది..Latest Telugu News

Update: 2022-08-06 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం యువతి, యువకులు ప్రేమలో పడటం విడిపోవటం మామూలు విషయం అయిపోయింది. కానీ, కొంతమంది మాత్రం ఆ ప్రేమ కోసం ఏం చేయాడానికైనా సిద్ధపడుతున్నారు. ఇతరులను చంపడమో, వారు చనిపోవడమో లాంటివి చేస్తుంటారు. కానీ, ఓ యువతి చేసిన పని చూస్తే షాక్ అవుతారు.

వివరాల్లోకి వెళితే.. అస్సోంలోని సువల్‌కచి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి పక్క గ్రామానికి చెందిన యువకుడితో పీకల్లోతు ప్రేమలో పడింది. అతడితో కలిసి మూడుసార్లు పారిపోవాలని కూడా చూసింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు వెతికి మరీ యువతిని తీసుకొచ్చారు. దాన్ని తట్టుకోలేకపోయిన యువతి.. ఊహించని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడికి కొద్ది నెలల క్రితం హెచ్‌ఐవీ వచ్చింది. అయితే ఆ యువతి సిరంజీ సాయంతో తన ప్రియుడి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది. తన ప్రియుడి నుంచి ఎవ్వరూ దూరం చేయకూడదనే ఉద్ధేశ్యంతో ఆ నిర్ణయం తీసుకునట్టు తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు.


Similar News