త్వరలోనే 400 ఎకరాల్లో ఫుడ్ పార్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: హన్వాడ మండలంలో త్వరలోనే 400 ఎకరాలలో ఫుడ్ పార్కును ఏర్పాటు - latest Telugu news

Update: 2022-03-31 17:25 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: హన్వాడ మండలంలో త్వరలోనే 400 ఎకరాలలో ఫుడ్ పార్కును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గురువారం హన్వాడ మండలంలో జరిగిన పలు కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. ముందుగా హన్వాడ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 143 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, 11 మంది దళిత బంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పరిశ్రమలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటుచేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వ్యవసాయరంగ ఉత్పత్తులకు ప్రాధాన్యతను కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు.

దళితులను ధనవంతులుగా తీర్చిదిద్దేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఇక్కడి పొలాలను అన్నింటిని మరింత పచ్చ పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం హన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మనబడి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. పనులు సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకొని, త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మహబూబ్ నగర్ పట్టణం భూత్పూర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, హన్వాడ మండలం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News