నిమ్స్ నర్సులకు వార్నింగ్..ప్రశ్నిస్తే టెర్మినేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు పది రోజుల పాటు నిమ్స్‌లో స్ట్రైక్ చేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఎట్టకేలకు విధుల్లో
దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు పది రోజుల పాటు నిమ్స్‌లో స్ట్రైక్ చేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నోళ్లందరినీ టెర్మినేషన్ చేస్తామని బెదిరించి మరీ విధుల్లో చేర్పించారంటూ నర్సులు ఆరోపిస్తున్నారు. ఇటు ప్రభుత్వం, నిమ్స్ ఒత్తిళ్లు తట్టుకోలేక నర్సులంతా బుధవారం నుంచే డ్యూటీల్లో చేరిపోయారు. అయితే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు ఇస్తున్న ప్రస్తుత వేతనం రూ. 25 వేలను రూ. 35 వేలకు పెంచుతూ నిమ్స్ నిర్ణయం తీసుకున్నది. దీనికి తోడు గడిచిన ఏడు నెలల నుంచి ఏరియల్స్ ఇవ్వనున్నారు. అంతేకాక పే-స్లిప్‌లు కూడా ఇచ్చేందుకూ అంగీకరించింది. ఇక మెటర్నిటీ లీవ్స్ అంశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో చర్చించి చెబుతామంటూ డైరెక్టర్ నర్సులకు వివరించారు.