2025: కొత్త సంవత్సరంలో మీ లైఫ్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారా..? ఫోకస్ చేయాల్సిన విషయాలివే
2025 లోకి అడుగుపెట్టేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: 2025 లోకి అడుగుపెట్టేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే కొత్త సంవత్సరం వస్తుందని.. చాలా తమ జీవితంలో కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. మరీ ఎలాంటి విషయాల్లో, ఏ విధంగా మారితే జీవితం బాగుంటుందో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది ఒక లక్ష్యం పెట్టుకుంటారు. కానీ దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయరు. ఒక్కటి, రెండు రోజులు మాత్రమే కొనసాగించి.. మరుసటి రోజూ మర్చిపోతారు. కానీ అలా కాకుండా మీరు గమ్యం వైపు వెళ్లాలంటే కొత్త సంవత్సరం నుంచి పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోండి. మీరు లైఫ్‌లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో.. ఓ రెండు నిమిషాలు ఆలోచించుకుని, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి.
అలాగే మీ ఫోన్‌లో ఉన్న అవసరం లేని యాప్స్ అన్ని డిలీట్ చేసి కొత్త సంవత్సరాన్ని ఫ్రెష్‌గా ప్రారంభించండి. మొబైల్‌లో యాప్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీ ఫోకస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే రిలేషన్స్‌తో టచ్‌లో ఉండండి. బంధాలను దూరం చేసుకోవద్దు. కనీసం పదిహేను రోజులకోకసారైనా మీ రిలేషన్స్‌లో ఫోన్‌లో సంభాషించండి. చదవడం, రాయడం వంటి వాటిపై ఫోకస్ చేయండి.
లైఫ్‌లో మార్పులు అంత ఈజీగా రావు. కాగా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు వ్యాయామం లేనివారు.. కొత్త సంవత్సరంలో దీన్ని అలవాటు చేసుకోవాలంటే మొదట్లో 10 మినిట్స్ వ్యాయామం చేస్తే చాలు. తర్వాత వారం తర్వాత20 నిమిషాలు.. ఇలా క్రమంగా సమయం పెంచుకుంటూపోవాలి. ఇలా నెమ్మదిగా వ్యాయామం మీ బాడీకి అలవాటు అవుతుంది.