VRA's Protest: మూడురోజులుగా వీఆర్‌ఏల సమ్మె.. కనికరించని సీఎం

VRA's Protest Reaches to Third day in Indalwai| మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు మూడవరోజు యధావిధిగా నిరావధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల సాయన్న ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తున్నారు

Update: 2022-07-27 08:13 GMT

దిశ,ఇందల్వాయి : VRA's Protest Reaches to Third day in Indalwai| మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు మూడవరోజు యధావిధిగా నిరావధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల సాయన్న ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తున్నారు. కాగా, మండల అధ్యక్షుడు సాయన్న మాట్లాడుతూ.. వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రకటించిన పే–స్కేల్ ను విడుదల చేసి వెంటనే జీవోను అమలు పరచాలన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ ను మా నిరవధిక సమ్మె ద్వారా తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు ఎర్రలో సాయన్న, ఉపాధ్యక్షులు ఎర్ర కిషన్, ప్రధాన కార్యదర్శి శరన్, కార్యదర్శులు బాలగంగారం, రవి ,రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కోమటిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయం: Bandi Sanjay

Tags:    

Similar News