కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను జేసీబీతో కూల్చేసిన మున్సిపల్ అధికారులు

దిశ, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భారీ కటౌట్లను.... Viral Video: Municipal staff demolised cutouts of KCR, KTR

Update: 2022-08-02 05:23 GMT

దిశ, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భారీ కటౌట్లను జేసీబీతో కూల్చే విడియోలు నెట్టింట్ల వైరల్ గా మారాయి. ఈ వీడియోలను సిరిసిల్ల బీజేపీ శ్రేణులు వాట్సాప్, ఫేస్ బుక్ సామాజిక మాధ్యమాల్లో వంగ్యఅస్త్రాలు సందిస్తూ.. వైరల్ చేస్తున్నారు. కేటీఆర్ బర్త్ డే రోజున ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి సిరిసిల్లలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశాడు. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ సమీపంలో ఈ భారీ కటౌట్ ను ఏర్పాటు చేయగా మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చేశారు. ఈ సందర్భంగా ఎవరో వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఆ వీడియోలను బీజేపి లీడర్లు వైరల్ చేస్తూ... అయ్యో పాపం కేటీఆర్ ... సిరిసిల్లలో బుల్డోజర్ల కాలం వచ్చింది అంటూ కామేంట్లు చేస్తూ వీడియోను వైరల్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం అవమానంగా భావిస్తున్నారు. కటౌట్ పై ఫిర్యాదులు ఉంటే మనుషులతో విప్పించాలి కానీ.. సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లను అవమానకరంగా.. కార్యకర్తల మనసు నొచ్చుకునేలా కూల్చివేయడం ఏంటని టీఆర్ఎస్ పార్టీలోనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హుటాహుటిన టీఆర్ఎస్ నేతలు, పాలకవర్గం సభ్యులు మున్సిపల్ అధికారులతో సోమవారం రాత్రి సమావేశమై జేసీబీతో కటౌట్ ఎందుకు కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కటౌట్ పై పలువురు ఫిర్యాదులు చేశారని, వర్షాకలం గాలి దూమారం వస్తే ప్రజలకు ప్రాణనష్టం కలిగే అవకాశం ఉన్నందున కటౌట్లు తొలగించవలసి వచ్చిందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఏది ఏమైన ఏకంగా సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు సంబంధించిన కటౌట్లు కూల్చివేయడం సిరిసిల్లలో తీవ్ర చర్చనీయంశమైంది.

టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు..?

సిరిసిల్ల టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు మాత్రం పోవడం లేదు. ఒకరు కార్యక్రమం చేస్తే ఇంకొకరు బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టడం సిరిసిల్లలో పరిపాటైంది. నేతల మధ్య రాజకీయ విభేదాలు.. ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేవూరి వెంకట్ రెడ్డి ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు సొంత పార్టీ నేతల ఆదేశాలతోనే తొలగించారని సమాచారం. నేవూరి వెంకట్రెడ్డి వర్గానికి ఎవరెవరు వ్యతిరేఖ వర్గం అంటూ సిరిసిల్లలో చర్చ ప్రారంభమైంది. సిరిసిల్ల మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ వర్గాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు అనుమతి ఇవ్వమన్నారు.. ఎవరు కూల్చమన్నారు అంటూ మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఒక అవకాశం ఇచ్చినట్లే కాకుండా.. కేసీఆర్ ను అవమాన పరచడమే అని పేర్కొంటున్నారు. 


Similar News