ఆ..ఆ.. మా రాంచరణ్‌ను ఎన్టీఆర్ కొడ్తుండూ... థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసి ఏడ్చిన బాలుడు(వీడియో)

దిశ, వెబ్ డెస్క్: కొన్ని కొన్ని సార్లు సినిమాల విషయంలో జరిగే కొన్ని..Video Viral: Kid crying in theatre watching emotional scene in RRR movie

Update: 2022-03-26 08:46 GMT

దిశ, వెబ్ డెస్క్: కొన్ని కొన్ని సార్లు సినిమాల విషయంలో జరిగే కొన్ని సంఘటనలు నమ్మశక్యంగా లేకున్నా కూడా అవి నిజంగానే జరుగుతుంటాయి. దీంతో అవి చూసి ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంటది. సినిమాను, అందులో నటీనటులను తనలో భాగం చేసుకోవడం లేదా సొంతవారుగా భావిస్తుంటారు. అందుకే వారి విషయంలో తమకు ఎంత అభిమానముందో ఆ విధంగా అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడుతుంటది. తాజాగా కూడా సినిమా థియేటర్‌లో ఓ చిన్న సన్నివేశం చోటు చేసుకుంది. దీంతో అక్కడున్నవారంతా చూసి ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే.. ఓ సినిమా థియేటర్‌లో ఓ బాలుడు ఆర్ఆర్ఆర్ మూవీని చూస్తున్నాడు. అయితే, ఆ బాలుడు ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు. ఏంటని అతని కుటుంబ సభ్యులు అడుగగా తన అభిమాన హీరో రాంచరణ్‌ను ఎన్టీఆర్ కొడుతున్నాడూ.. విలన్‌గా క్రియేట్ చేస్తున్నారూ.. నేను ఊరుకోను అంటూ ఏడిచాడు. ఇది విన్న అతని కుటుంబ సభ్యులు అది సినిమా నాన్న అంటూ అతడిని ఓదార్చారు. ఇదంతా కూడా అక్కడున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. 'ఓరినీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాగే తయారయిందీగా... అభిమాన హీరోను తెరపై కొంచెం తక్కువగా చూపించారని ఇలా ఏడుస్తున్నాడే' అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

Tags:    

Similar News