పంజాబ్ నూతన సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి

దిశ, నేరేడుచర్ల: పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కారదర్శిగా..Venu Prasad appointed Principal Secretary to Punjab CM

Update: 2022-03-12 15:03 GMT

దిశ, నేరేడుచర్ల: పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కారదర్శిగా అరిబండి వేణు ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్న గ్రామం. 1991 లో సివిల్స్ రాసి ఐఏఎస్ గా నియమకం అయ్యారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కొత్తగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ సీఎండీగా ఉన్నారు. సీఎం ముఖ్య కార్యదర్శిగానే కాకుండా సీఎండీగా కొనసాగనున్నారు. ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ అదనపు బాధ్యతలను కూడా చూస్తున్నారు. వేణు తన పనితీరు, లక్ష్యాల సాధనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదర్శవంతంగా పనిచేస్తూ ఏ శాఖలో బాధ్యతలు నిర్వహిస్తే ఆ శాఖ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. అరిబండి రంగయ్య, మంగమ్మ దంపతులకు రెండో సంతానంగా వేణు ప్రసాద్ 1964లో జన్మించారు. ప్రాథమిక విద్య మునగాలలో, పదో తరగతి వరకూ ఖమ్మంలో చదివారు. నాగార్జున సాగర్ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆ తర్వాత 1980 లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేరారు. 1991లో సివిల్స్ రాసి తన ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించారు. అప్పటి పంజాబ్ కేడర్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నుండి వివిధ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసి పలువురు ప్రజాప్రతినిధుల మన్నలను పొందారు. ఆయన బంధువులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News