ఐదేళ్లలో సెమీకండక్టర్ల వ్యాపారం నుంచి రూ. 28 వేల కోట్ల టర్నోవర్: వేదాంత గ్రూప్.!
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీ కండక్టర్లను తయారు చేసేందుకు వేదాంతా గ్రూప్ సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీ కండక్టర్లను తయారు చేసేందుకు వేదాంతా గ్రూప్ సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదాంత కంపెనీ సెమీకండక్టర్ వ్యాపారం ద్వారా సుమారు రూ. 23.7 వేల కోట్ల నుంచి రూ. 27.63 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఇందులో దాదాపు రూ. 8 వేల కోట్ల ఆదాయాన్ని ఎగుమతుల ద్వారా వస్తుందని కంపెనీ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీని ప్రారంభించేందుకు తన జాయింట్ వెంచర్ భాగస్వామ్య సంస్థ ఫాక్స్‌కాన్‌తో అన్ని రకాల ఒప్పందాలు, అవసరమైన టెక్నాలజీ అందుబాటులో ఉందని వేదాంత గ్రూప్ డిస్‌ప్లే, సెమీకండక్టర్ బిజినెస్ గ్లోబల్ ఎండీ ఆకర్ష్ హెబార్ అన్నారు.
దేశంలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం చేసుకున్న మూడు కంపెనీల్లో వేదాంత ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ కూడా ఉంది. దీంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల్లో అవసరమైన స్క్రీన్‌లను తయారు చేసేందుకు డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు వేదాంత గ్రూప్ దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో 2026-27 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 24-28 వేల కోట్ల వరకు ఆదాయాన్ని ఈ విభాగం నుంచి సాధించగలమనే విశ్వాసం ఉంది. ఇది డిస్‌ప్లే, సెమీకండక్టర్ రెండింటి ద్వారా వస్తుందని, ఎగుమతులు కూడా రూ. 8 వేల కోట్ల వరకు జరుగుతాయని ఆకర్ష్ వివరించారు. వేదాంత గ్రూప్ సెమీకండక్టర్ వ్యాపారం కోసం రూ. 1.50 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను కేటాయించింది. ఇందులో 75 శాతం వరకు రాబోయే 10 ఏళ్లలో పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది.