Uttarakhand: 200 మంది మృతి.. నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం

Uttarakhand Government Confirms 200 People were Killed| ఇటీవల కాలంలో ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రలో సంభవించిన మరణాల లెక్కను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న చార్‌ధామ్ యాత్రలో

Update: 2022-06-27 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: Uttarakhand Government Confirms 200 People were Killed| ఇటీవల కాలంలో ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రలో సంభవించిన మరణాల లెక్కను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న చార్‌ధామ్ యాత్రలో ఇప్పటివరకు మొత్తం 200 మందికి పైగా మరణించినట్లు తెలిపింది. చార్‌ధామ్ యాత్రకు వచ్చి.. వృద్ధాప్యం.. ఆరోగ్య సమస్యలు, అలాగే వైద్య సమస్యల కారణంగా ఈ మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో.. కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో 95 మంది, బద్రీనాథ్ ధామ్‌లో 51 మంది, గంగోత్రిలో 13 మంది, యమునోత్రిలో 42 మంది యాత్రికులు మరణించినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది.

Tags:    

Similar News