Custard Apple Seeds: సీతాఫలం గింజల్ని పారేస్తున్నారా.. ఇలా వాడండి?

సీతాఫలం గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

Update: 2024-10-20 16:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీతాఫలం గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. సీతాఫలంలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతాయి.సీతాఫలం గింజల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు కదుళ్లను బలోపేతం చేస్తాయి. సీతాఫలం గింజల్లోని విటమిన్‌ ఏ కంటిచూపును మెరుగుపరుస్తాయి. అయితే చాలా మంది సీతాఫలం తిని దానిలోని గింజల్ని పడేస్తుంటారు. కానీ వీటి గింజలతో బోలెడ్ లాభాలున్నాయి. ఈ పండు గింజలు జుట్టుకు మేలు చేస్తాయి.

జుట్టు పూర్తి ఆరోగ్యానికి మేలు..

ఇందుకోసం సీతాఫలం గింజల్ని పగలగొట్టి కొబ్బరి ఆయిల్ లో వేసి వేడి చేయండి. తర్వాత జుట్టుకు రాసుకుని 30 నిమిషాలు టవల్ చుట్టి హెడ్ బాత్ చేస్తే హెయిర్ హెల్తీగా ఉంటుంది. నిగనిగలాడుతుంది. సీతాఫలం ఆయిల్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది. ఇది వాడితే చుండ్రు సమస్య దూరం అవుతుంది. ఈ ఆయిల్ పాదాల పగుళ్ల వద్ద అప్లై చేస్తే సాఫ్ట్ గా తయారవుతాయి. సీతాఫలం పండు గింజల్లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని, హెయిర్ ను హెల్తీగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ తెల్లబడటం తగ్గుతుంది. పోడవుగా పెరుగుతుంది. 

కాంతివంతమైన స్కిన్ మీ సొంతం..

ఫేస్ కు అప్లై చేస్తే ఈ ఆయిన్ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. పింపుల్స్ తగ్గుముఖం పడుతాయి. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. ఫేస్ పై ఇంతకుముందు ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News