Vikatakavi: ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది.. ‘వికటకవి’ ప్రెస్ మీట్‌లో నిర్మాత కామెంట్స్

నరేష్ అగస్త్య (Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) కాంబోలో వస్తున్న తాజా సిరీస్ ‘వికటకవి’ (Vikatakavi).

Update: 2024-11-25 13:35 GMT
Vikatakavi: ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది.. ‘వికటకవి’ ప్రెస్ మీట్‌లో నిర్మాత కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: నరేష్ అగస్త్య (Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) కాంబోలో వస్తున్న తాజా సిరీస్ ‘వికటకవి’ (Vikatakavi). ప్రదీప్ మద్దాలి (Pradeep Maddali) దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి (Ram Talluri) నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ఈ సరీస్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. నవంబర్ 28 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతున్న క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ‘రామ్ తాళ్లూరి నిర్మాణంలో ప్రదీప్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 28న జీ5లో రాబోతోంది. అందరూ చూడండి. కచ్చితంగా ఈ సిరీస్ మీకు నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇక నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను నాకు సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్ ఫిల్మ్ (Feature Film) అనుకున్నాం. కానీ జీ5 వల్ల ఇది వెబ్ సిరీస్‌లా మారింది. అద్భుతంగా ఈ వెబ్ సిరీస్‌ను జీ5 నిర్మించింది. కంటెంట్ చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. దర్శకుడు ప్రదీప్‌కు చాలా మంచి పేరు వస్తుంది. చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. సాగర్, మహేంద్ర ఇలా అందరూ కష్టపడి చేశారు. నరేష్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి విజయాలు దక్కాలి. మేఘా ఆకాష్ అద్భుతంగా నటించారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. జీ5లో నవంబర్ 28న ఈ సిరీస్‌ను అందరూ చూడండి.. కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు.

Tags:    

Similar News