ఉక్రెయిన్ పరిస్థితులు ఆందోళనకరం.. ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో యుధ్ద పరిస్థితులు - "Ukraine Situation Worrying": PM To Biden In Virtual Meet

Update: 2022-04-11 17:15 GMT

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో యుధ్ద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటికే రష్యాను యుద్దం ఆపాలని కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఏ దేశానికి మద్దతిచ్చే విషయంలో మాత్రం తటస్థంగానే ఉన్నట్లు పునరుద్ఘాటించారు. సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఆయన వర్చువల్ గా సమావేశమయ్యారు. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న చర్చలు శాంతి దిశగా ముందుకెళ్లాలని కోరారు. 'మేము ఉక్రెయిన్‌లోని పౌర జనాభా భద్రతకు, వారికి మానవతా సహాయాన్ని నిరంతరాయంగా సరఫరా చేయడానికి కూడా ప్రాముఖ్యతనిచ్చాము. తాజాగా బుచాలో అమాయక పౌరుల మరణాలు తీవ్రంగా కలచివేశాయి. వెంటనే వాటిని ఖండిస్తూ పారదర్శక దర్యాప్తు చేపట్టాలని మేము డిమాండ్ చేశాం' అని ప్రధాని అన్నారు.

గతేడాది తాను భారత్ వచ్చినప్పుడు భారత్-అమెరికాల భాగస్వామ్యం అనేక అంతర్జాతీయ సమస్యలకు సమాధానమని బైడెన్ చెప్పారన్నారు. ఈ విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచపు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలుగా మనం ఎప్పుడు సహజ భాగస్వాములేమని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాలు సంప్రదింపులను కొనసాగిస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాడు. తమ నిరంతర సంప్రదింపులు ఇరు దేశాల మధ్య సంబంధాలను లోతుగా, బలోపేతం చేస్తాయని అన్నారు. ఉక్రెయిన్ కు భారత్ మానవత్వ సహాయాన్ని బైడెన్ స్వాగతించారు.

Tags:    

Similar News