భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది పండుగ: ఉపరాష్ట్రపతి

దిశ, శంషాబాద్: ప్రజల సమస్యలను వదిలేసి అసెంబ్లీలలో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం latest telugu news..

Update: 2022-04-02 10:11 GMT

దిశ, శంషాబాద్: ప్రజల సమస్యలను వదిలేసి అసెంబ్లీలలో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరిగిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు విమర్శలు.. ప్రతి విమర్శల స్థాయి తగ్గట్టు ఉండాలన్నారు. ప్రజాప్రతినిధుల వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకూ దిగజారిపోతుందని అన్నారు.

కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు వారి భాష వినసొంపుగా లేదని, వారి చేష్టలు కూడా.. వారి పదవికి తగ్గట్టు లేవని, వారి తీరు పట్ల పూర్తిగా వ్యవస్థకే చెడ్డపేరు వచ్చే విధంగా ఉందన్నారు. అసెంబ్లీలో కూడా వారు వాడుతున్న భాష పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించడం మంచిది కాదన్నారు. కాలాన్ని గౌరవించుకోవడం ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన ఉగాది పండుగ లోని ప్రధాన సందేశములు అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది పండుగను ప్రతీక అన్నారు. ఉగాదితోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని ప్రస్తుతం శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది జరుపుకుంటున్నమన్నారు.

శుభకృత్ అంటే మేలు కలిగించేదని అర్థం అని ఈ పండుగ అందరి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఉగాది కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు డాక్టర్ సాగి కమలాకర శర్మ ఉగాది కష్టాన్ని తెలియజేయడంతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ తెలుగు పద్య వైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఔత్సహిక కళాకారిణి కుమారి మన్నె టీనా చౌదరి కూచిపూడి నృత్య ప్రదర్శన, ప్రముఖ వ్యాఖ్యాత చల్లగాలి వెంకట రాజు సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News