వికారాబాద్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ట్విస్ట్..

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మొదటి నుంచి అనుమానితుడిగా latest telugu news..

Update: 2022-03-29 04:16 GMT
వికారాబాద్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ట్విస్ట్..
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మొదటి నుంచి అనుమానితుడిగా ఉన్న ప్రియుడిని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో ప్రియుడు మహెందర్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో.. బాలిక తల్లిని పోలీసులు విచారించారు. విచారణ లో బాలిక తల్లి పొంతన లేని సమాధానాలు చెప్పడం తో బాలిక తల్లిపైనే పోలీసులకు అనుమానం. వివాహేతర సంబంధమే బాలిక హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను ఇంట్లోనే హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్లాన్ ప్రకారం బాలిక ప్రియుడు మహెందర్‌ని ఇరికించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అనుమానితులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రాలేదని..అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే టవర్ డంపు, పోస్టుమార్టం వివరాలు అందాల్సి ఉందన్నారు. కాబట్టి ఎవరు తప్పుడు పోస్టులు ప్రాచారం చేయవద్దని కోరారు.

Tags:    

Similar News