Chandrababu: స్వగ్రామంలో సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకలు..
నారావారి పల్లె(Naravari Palle)లో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) రెండవ రోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
దిశ, వెబ్ డెస్క్: నారావారి పల్లె(Naravari Palle)లో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) రెండవ రోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబు స్వగ్రామం అయిన నారా వారి పల్లెలో సీఎం పర్యటిస్తున్నారు. రెండు రోజులుగా కుటుంబంతో సహా అక్కడే ఉండి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత గంగమ్మకు చంద్రబాబు పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న నాగులమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తన తల్లిదండ్రలు నారా ఖర్జూర నాయుడు, అమ్మాణమ్మ సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు. తర్వాత తన నివాసం వద్ద నందమూరి తారక రామారావు(Nandamuri Tharaka Ramarao), బసవతారకం విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh), నారా బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ సహా ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం నారావారి పల్లె పర్యటనలో భాగంగా సమస్యలపై ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరించారు.