Visakha: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే..!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రంప్యాకేజ్ శుభపరిణామమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు...

Update: 2025-01-17 08:41 GMT
Visakha: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)ను అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం(Central Government) ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ. 11,500 కోట్లతో ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(Economic Affairs Cabinet Committee) ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే త్వరలో ఈ ప్యాకేజీ పట్టాలక్కే అవకాశాలున్నాయి.


దీంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం స్టీల్ ప్లాంట్ వద్ద టీడీపీ అధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(TDP MLA Ganta Srinivasa Rao) మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రంప్యాకేజీ ప్రకటించడం శుభపరిణామమన్నారు. కేంద్రం రూ.11,500 కోట్ల ప్యాకేజీ నిర్ణయంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టేనని అర్థమవుతోందన్నారు. ప్రధాని మోడీ(Pm Modi), సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌(Deputy Cm Pawan)కు తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. గతంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేశానని గుర్తు చేశారు. తమ పోరాటానికి కూడా ఫలితం దక్కిందని గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News