Heavy Rains:రెయిన్ అలర్ట్.. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన
గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు(Rains) దంచికొట్టిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు(Rains) దంచికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh)కి మరోసారి వాతావరణ శాఖ(Department of Meteorology) రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం(low pressure) తొలగిపోయింది. కానీ అల్పపీడన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని వల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో రేపు ఎల్లుండి(18, 19 తేదీల్లో) అక్కడక్కడ భారీ వర్షాలు(Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం గురువారం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగిపోయింది. ఉదయం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణం(Tropo premises)లో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.