Varalakshmi Sarath Kumar: కచ్చితంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తా.. వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) తెలుగు, తమిళ మలయాళ చిత్రాల్లో నటిస్తూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది.

Update: 2025-01-14 08:20 GMT
Varalakshmi Sarath Kumar: కచ్చితంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తా.. వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) తెలుగు, తమిళ మలయాళ చిత్రాల్లో నటిస్తూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. గత ఏడాది ‘హనుమాన్’(Hanuman) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె తెలుగులో విలక్షణ నటిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక వరలక్ష్మి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత ఏడాది సచ్‌దేవ్ నికోలయ్‌(Sachdev Nikolai)ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఓ వైపు వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే నటనను కొనసాగిస్తోంది.

తాజాగా, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ‘మదగజరాజా’(Madagajaraja) జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘12 ఏళ్ల క్రితం నటించిన మద గజ రాజా పొంగల్ సందర్భంగా విడుదల కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నేను ‘పోడా పోడీ’ సినిమా తర్వాత నటించిన రెండో మూవీ ఇదే. పది ఏళ్లలోనే చాలా మారిపోయింది. నేను ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా వెళుతుండగా.. కొందరు వచ్చి ఫొటోలు తీసుకున్నారు. అప్పుడు ఒక అతను వచ్చి నన్ను అడిగితే.. నాకు సమయం లేదని చెప్పాను.

దీంతో అతను ఫొటో తీసుకోనివ్వనప్పుడు నటనలోకి ఎందుకు వచ్చారని అన్నాడు. అలాంటి వారికి బదులివ్వాల్సిన అవసరం లేదని అనిపించింది. అయితే నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. కానీ అందుకు ఇంకా సమయం ఉంది. నేను దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్పూర్తితోనే పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది. కాగా, ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Tags:    

Similar News