Internet: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలా.. NPCI ప్రవేశపెట్టిన ఈ కోడ్ వాడండి..!

స్మార్ట్‌ ఫోన్‌లో ఏం చేయాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరి.

Update: 2024-12-01 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ ఫోన్‌(Smart phone)లో ఏం చేయాలన్నా ఇంటర్నెట్(internet) తప్పనిసరి. యూపీఐ(UPI) ద్వారా ట్రాన్సాక్షన్లు చేయాలన్నా డాటా అవసరం ఉంటుంది. టీ పాయింట్ కెళ్లి టీ తాగాలన్నా.. చిన్న వస్తువులు లేదా పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేసినా ఫోన్ పే(Phone pay), గూగుల్ పే(Google pay) ద్వారా చెల్లిస్తున్నారు. కాగా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఆ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు డాటా లేకుండానే యూపీఐ చెల్లింపులు జరపవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(National Payments Corporation of India) ఓ స్పెషల్ ఫెసిలిటీని కల్పిస్తోంది. ఇందుకోసం మీరు మీ ఫోన్ లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన *99# USSD కోడ్‌ను డయల్ చేయాలి. తర్వాత మీకు.. డబ్బును స్వీకరించడం, మీ సమాచారం, డబ్బును పంపడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.

ఇప్పుడు మీరు ఎవరికైనా మనీ పంపాలనుకున్నా.. రిసీవ్ చేసుకోవాలన్నా యూపీఐ అకౌంట్ కు లింకప్ అయిన ఫోన్ నెంబర్ ను కొట్టి.. సెండ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంత డబ్బు పంపాలో టైప్ చేశాక.. మళ్లీ సెండ్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దీంతో సులభంగా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. UPI లావాదేవీని ఆఫ్‌లైన్‌లో నిర్వహించడానికి ఈ USSD సేవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఈ సేవను నిలిపివేయడానికి కూడా అవకాశం ఉంది.

Tags:    

Similar News