Pushpa 2: లండన్ వీధుల్లో ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్ అదిరిపోయే స్టెప్పులు..!!
దేశవ్యాప్తంగానే కాకుండా మన పుష్పరాజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగానే కాకుండా మన పుష్పరాజ్(Pushparaj) పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప-2’(Pushpa 2) కు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. సమయం దగ్గరపడుతోన్న కొద్ది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ‘ఈగర్లీ వెయింగ్ బన్నీ అన్న మాస్ మూవీ పుష్ప’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికన హంగామా చేస్తున్నారు. మొదటి భాగం అంచనాలకు మించి భారీ వసూళ్లు కొల్లగొట్టడంతో రెండో పార్ట్‌పై జనాలు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్లు(Posters), గ్లింప్స్(Glimpses), టీజర్స్(Teasers) విడుదలైన విషయం తెలిసిందే. విడుదల నేపథ్యంలో ఇటీవలే శ్రీలీల(sreeleela) స్టెప్పులేసి ఐటెమ్ సాండ్ అండ్ నిన్న (డిసెంబరు 1) పీలింగ్స్ ఫుల్ సాంగ్(Peelings Song) రిలీజ్ చేశారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్ విషయంలో కూడా పుష్ప టీమ్ ఏమాత్రం తగ్గడం లేదు. పాన్ ఇండియా లెవల్‌లో ప్రమోషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్‌గూడ(Yousafguda)లోని పోలీస్ గ్రౌండ్(Police Ground)లో ఘనంగా జరుపుతున్నారు.
ఇకపోతే బన్నీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. లండన్(London) అభిమానులు ఐకాన్‌స్టార్(Iconstar) కు పెద్ద ట్రీట్ ఇచ్చారు. లండన్ వీధుల్లో కొంతమంది ‘పుష్ప పుష్ప రాజ్’(Pushpa Pushpa Raj) అనే హిందీ పాటను అదిరిపోయే స్టెప్పులేశారు. అల్లు అర్జున్‌పై అభిమానాన్ని చాటుతోన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) స్పందించి.. ‘ఇండియన్ బిగ్గెస్ట్ చిత్రం పుష్ప-2లోని పుష్ప సాంగ్‌కు లండన్ వీధుల్లో అభిమానులు డ్యాన్స్ చేస్తూ.. తమ ప్రేమను చూపించారు’. అని సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ వీడియోను రీ షేర్ చేస్తూ రాసుకొచ్చారు.