Fire Accident: సుప్రీంకోర్టు ఆవరణలో అగ్నిప్రమాదం
సుప్రీంకోర్టు ఆవరణలో ఉన్న వెయిటింగ్ హాల్ లో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు (Supreme Court) ఆవరణలో అగ్నిప్రమాదం జరిగింది. కోర్టు హాల్ 11, 12 మధ్య ఉండే వెయిటింగ్ హాల్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అంతా క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పటిష్టమైన భద్రత ఉన్న సుప్రీంకోర్టు ఆవరణలో అగ్నిప్రమాదం జరగడంతో.. అంతా ఆందోళన చెందారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కోర్టు భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.