Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!!
ఇటీవల ఏపీలో దంచికొట్టిన వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగి.. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీలో దంచికొట్టిన వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగి.. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే శనివారం (డిసెంబరు 7) తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షం పడింది. ఇవాటి నుంచి 9 వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ‘విశాఖపట్నం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం, కోనసీమ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో తేలికపాటి వాన పడనుందని తెలిపింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.