Dispute: రూ.లక్ష బాండ్ అందజేత
హైదరాబాద్ రాచకొండ కమిషనర్‌కు రూ. లక్ష చొప్పున బాండ్లను మంచు బ్రదర్స్ చెల్లించారు...
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మంచు మోహన్ బాబు(Movie actor Manchu Mohan Babu) కుటుంబంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మంచు విష్ణు(Manchu Vishnu), మనోజ్(Manchu Manoj) మధ్య ఆస్తుల పంచాయితీ మరింత ముదరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్‌పై దాడి నేపథ్యంలో ఈ వివాదం హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్(Hyderabad Rachakonda Commissionerate)కు చేరింది. దీంతో కమిషనర్ కార్యాలయంలో మంచు మనోజ్‌తో పాటు విష్ణును విచారించారు. మంచు మనోజ్ విచారణ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుతో పోలీసులు రూ. లక్ష బాండ్ తీసుకున్నారు. అటు మంచు విష్ణును సైతం గంటకు పైగా విచారించారు.
అయిదు మంచు బద్రర్స్ ఇద్దరు ఎవరి వాదన వారు వినిపించారు. ఘర్షణకు దిగవద్దని అన్నదమ్ములిద్దరికీ పోలీసుల సూచించారు. ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని తెలిపారు. అటు విష్ణు నుంచి కూడా రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు తీసుకున్నారు. విచారణ ముగియడంతో రాచకొండ సీపీ ఆఫీసు నుంచి మంచు విష్ణు వెళ్లిపోయారు.