హలో హరీష్... నిద్రావస్థ నుంచి లేవ్..!
సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు...
దిశ; తెలంగాణ బ్యూరో: ‘హలో హరీష్..ఔట్ డెటెడ్ ఐనవా’ అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిద్రావస్థలో ఉండి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఆయన సోషల్ మీడియా వేదికగా సూచించారు. ప్రజాప్రభుత్వంలో నందిని సిద్ధారెడ్డికి పురస్కారం ఇవ్వలేదనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ప్రభుత్వాన్ని నిత్యం బద్నాం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు.
ఇక గత పది రోజులుగా పార్లమెంటు సమావేశాలు నడవకుండా ఇండియా కూటమి ఎంపీలు అడ్డుకుంటున్నారని తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అదాని, సంబల్, మణిపూర్ అంశాల గురించి పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కావాలనే బీజేపీ ప్రభుత్వం సభను వాయిదా వేస్తున్నారన్నారు. సభను సజావుగా నడపడం వాళ్లకు ఇష్టం లేదన్నారు. ఉభయసభలలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదన్నారు. సభలలో అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించాలన్నారు. ప్రతిపక్ష ఎంపీలకు అవకాశం ఇవ్వడంలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.