APPSC పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత ప్రణవ్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ - TNSF President MV Pranav Gopal comments on APPSC Public Service Commission
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైసీపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారింది అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షలకు తప్పనిసరిగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలు అన్నింటికీ ఇంటర్వ్యూలు రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 'గతంలో జరిగిన విధంగానే పేపర్ లీకేజీ జరిగితే కష్టపడి ప్రిపేర్ అయిన అభ్యర్థులు నష్టపోవాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీలో పారదర్శకత లోపించింది.
ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల రద్దు ఆలోచనపై మేధావులతో అభిప్రాయ సేకరణ జరపాలి. ఏపీపీఎస్సీ మెంబర్స్ అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే కావడం దురదృష్టకరం. రాజకీయాలకు అతీతంగా ఉండవలసిన ఏపీపీఎస్సీ ని రాజకీయమయం చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిని కూడా ఏపీపీఎస్సీ మెంబర్‌గా నియమించడం చూస్తే ఏపీపీఎస్సీ పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది' అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ ధ్వజమెత్తారు.