చిటికెలో నిద్రకు పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్స్.. సైన్స్ సపోర్ట్‌‌తో 'స్లీపింగ్ సర్వీస్'

దిశ, ఫీచర్స్ : మనసారా నవ్వడమే కాదు కంటి నిండా నిద్రపోవడం కూడా ఒక భోగమే. కొందరు కూర్చున్న చోట కునుకుతీసే.. Latest Telugu News..

Update: 2022-03-12 03:10 GMT

దిశ, ఫీచర్స్ : మనసారా నవ్వడమే కాదు కంటి నిండా నిద్రపోవడం కూడా ఒక భోగమే. కొందరు కూర్చున్న చోట కునుకుతీసే భాగ్యాన్ని కలిగివుంటే.. మరికొందరు పట్టు పరుపుల మీద పొర్లు దండాలు పెట్టినా సరే కంటి మీద రెప్ప వాల్చలేరు. ఇక అధ్యయనాల ప్రకారం ప్రతీ ముగ్గురు వయోజనుల్లో ఒకరు తగినంత నిద్రను పొందడం లేదు. అయితే సైన్స్ సపోర్ట్‌ సిస్టమ్‌తో కూడిన స్పెషల్ స్ట్రీమింగ్ సర్వీస్ Restflix.. ఈ బాధల నుంచి విముక్తి కలిగిస్తోంది. క్షణాల్లో ప్రశాంతమైన నిద్రను కల్పిస్తోంది.


సభ్యత్వం ఎలా పని చేస్తుంది?

ప్రకటనలు లేని ఈ స్ట్రీమింగ్ సర్వీస్.. స్లీప్ మెడిటేషన్స్, బెడ్ టైమ్ స్టోరీస్, ప్రశాంతమైన విజువల్స్, ఓదార్పునిచ్చే శబ్దాలతో కూడిన పదికిపైగా పర్సనలైజ్‌డ్ చానెల్స్‌తో రూపొందించబడింది. IOS, Android లేదా ఏదైనా ప్రధాన ప్లాట్‌ఫామ్స్‌లో బెడ్ టైమ్‌కు ముందు వీటిని వినడం ద్వారా పరధ్యానాన్ని తొలగించుకుని వెంటనే నిద్రలోకి జారుకోవచ్చు. ఇక ప్రతీవారం కొత్త కంటెంట్ యాడ్ చేయబడుతుంది కాబట్టి ఒకే రకమైన శబ్దాలు లేదా కథలను వినాల్సిన అవసరం ఉండదు.

సుదీర్ఘమైన పని లేదా ఒత్తిడితో కూడిన పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత మానసిక స్వస్థతను కలిగించడంలో ఇది గొప్పగా సహాయపడుతుంది. లైవ్‌స్ట్రాంగ్ ద్వారా నిద్రలోకి జారుకునేందుకు బెస్ట్ స్లీప్ యాప్‌గా పేరుపొందిన Restflix.. ఆందోళన నుంచి ఉపశమనంతో పాటు వేగంగా నిద్రపోయేందుకు నిపుణులచే ధృవీకరించబడిన శాస్త్రీయ విధానాలను అవలంబిస్తోంది.

Tags:    

Similar News