సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి.. ఆర్జీవి సెన్సేషనల్ పోస్ట్

వివాదాస్పద డైరెక్టర్ సోషల్ మీడియాలో చీరలో కనిపించిన ఓ అమ్మాయి అందానికి ఫిదా అయి ‘శారీ’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-16 12:04 GMT

దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ సోషల్ మీడియాలో చీరలో కనిపించిన ఓ అమ్మాయి అందానికి ఫిదా అయి ‘శారీ’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో శ్రీలక్ష్మి అలియాస్ ఆరాధ్య దేవిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేపిస్తున్నారు. అయితే దీనిని గిరి కృష్ణకమల్ తెరకెక్కిస్తుండగా.. ఆర్జీవి సమర్పణలో రాబోతుంది. ఇందులో సత్యా యాదు, ఆరాధ్య దేవి జంటగా నటిస్తున్నారు. ఇటీవల శారీ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఆర్జీవీ ‘X’ వేదికగా శారీ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలోని ‘ఐ వాంట్ లవ్’ అనే పాటకు సంబంధించిన ప్రొమో షేర్ చేస్తూ.. ‘‘సినీ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి.

శారీ సినిమాకు సంబంధించిన సాంగ్ ఏఐ ద్వారా మూడు వెర్షన్స్‌లో రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు సాంగ్ రాబోతుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా మూడు వెర్షన్స్‌లో ప్రోమెలను షేర్ చేశారు. ప్రజెంట్ ఆర్జీవీ ట్వీట్ నెట్టింట్ సంచలనం సృష్టిస్తోంది. ఆయన విడుదల చేసిన సాంగ్ ప్రొమో కుర్రకారులను మంత్రముగ్దులను చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందులో ముఖ్యంగా ఆరాధ్య ఎక్స్‌పోజింగ్‌ చూసి యూత్ షాక్ అవుతున్నారు. అయితే ఈ బోల్డ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది పాన్ ఇండియా మూవీగా నవంబర్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. 


Similar News