Mood Swings : పొద్దున్నే ఆ ఫీలింగ్ వేధిస్తోందా..? ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే!

Mood Swings : పొద్దున్నే ఆ ఫీలింగ్ వేధిస్తోందా..? ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే!

Update: 2024-11-25 07:37 GMT

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే వింటర్‌లో ఎక్కువమంది పొద్దున్నే మూడ్ స్వింగ్స్ ఎదుర్కొంటుంటారు. వ్యాయామాలు తగ్గడం, ఉదయంపూట ఎండ తగలకపోవడం, శరీరంలో విటమిన్ డి లోపించడం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయి. ఇక ఒంటరిగా ఉండేవారైతే మరింత ఎక్కువగా మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే చాన్సె్స్ ఉంటాయి. దిగాలుగా అనిపించడం, చిన్న విషయానికే అతిగా ఊహించుకొని బాధపడటం వంటి ప్రతికూల మానసిక పరిస్థితులు కూడా వేధిస్తుంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా ఇలాంటి మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. అవేమిటో చూద్దాం.

* డార్క్ చాక్లెట్ తినండి : ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనోల్స్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో డార్క్ చాక్లెట్ ఒకటి. దీనిని తినడంవల్ల బాడీలో సెరటోనిన్ హార్మోన్ లెవల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో తినడంవల్ల ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి భావాల నుంచి బయటపడవచ్చు. నేరుగా తినడానికి ఇష్టపడని వారు ఓట్స్, కాఫీ, హెల్తీ డ్రింక్స్‌లోనూ దీనిని కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుతుంది.

* నట్స్ అండ్ సీడ్స్ : శరీరానికి మేలు చేసే పోషకాలకు మూలం కాబట్టి బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, అట్లనే సన్‌ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, ఇతర తినగలిగే కాయగూరల గింజలు ఆహారంలో భాగంగా తీసుకుంటే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. హ్యాపీనెస్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ సెరోటోనిన్ హార్మోన్‌ను పెంచుతాయి. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

*అరటి పండ్లు, ఓట్స్ : ప్రతీ సీజన్‌లో అందుబాటులో ఉండే ముఖ్యమైన ఫలాల్లో అరటి పండ్లు ఒకటి. వీటిలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. చలికాలంలో తరచుగా తినడంవల్ల ఫీల్ గుడ్ హార్మోన్లుగా పేర్కొనే డొపమైన్, అలాగే సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఓట్స్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే నీరసం, బద్ధకం పోతాయి. మానసిక పరిస్థితి మెరుగు పడుతుంది.

* ఫ్యాటీ ఫిషెస్, బెర్రీలు : బ్యాడ్ మూడ్ స్వింగ్స్‌ను పోగొట్టే ముఖ్యమైన ఆహారాల్లో ఫ్యాటీ ఫిష్ ఒకటి. ముఖ్యంగా సాల్మోన్, టునా వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కూరగా వండుకొని తినడంవల్ల ఒత్తిడి, ఆందోళన భావాలు తగ్గుతాయి. అట్లనే ఫ్లేవనాయిడ్స్, యాంథో సియానిస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు మూలమైన స్ట్రా బెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి కూడా మీలోని ప్రతికూల మానసిక స్థితిని పోగొడతాయి. హ్యాపీనెస్‌ను పెంచుతాయి. వింటర్‌లో పొద్దున్న బాధాకరమైన ఫీలింగ్స్ వేధించేవారు వీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News