Forgiveness : క్షమించే అలవాటుతోనూ ఆరోగ్యం.. ఎన్ని లాభాలో తెలుసా?

Forgiveness : క్షమించే అలవాటుతోనూ ఆరోగ్యం.. ఎన్ని లాభాలో తెలుసా?

Update: 2024-11-25 08:52 GMT

దిశ, ఫీచర్స్ : వ్యక్తిగతంగానో, సామాజికంగానో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తీవ్రమైన విషయాల్లో క్షమించడం మంచిదని దాదాపు ఎవరూ చెప్పరు. కానీ నిత్య జీవితంలో, మానవ సంబంధాల్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకుంటూ పోతే.. చివరికి మీరు ఒంటరై పోతారు. కాబట్టి క్షమించేసేయండి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ భూమిపై ఏదో ఒక పొరపాటు చేయని వ్యక్తులంటూ ఎవరూ ఉండరు. కాబట్టి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులు, అదర్స్ ఎవరైనా సరే.. సహజంగానో, అనుకోకుండానో వారు చేసే పొరపాట్లను క్షమించేసేయండి. పైగా దీనివల్ల అవతలి వారు తమ తప్పును సరిదిద్దుకుంటారు. మీరు కూడా సంతోషంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

నిజానికి క్షమించడం(Forgiveness) అంత ఈజీ కాదు. దానికి సముద్రమంత విశాలమైన మనసుండాలి. కొండంత ధైర్యం కావాలి. టన్నుల కొద్దీ ఆత్మ విశ్వాసం ఉండాలి అంటారు నిపుణులు. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే ఆవేశ పడటం, కోపాలు పెంచుకోవడం, గొడవలు పడటం, పగలూ ప్రతీకారాలకు పోవడం వంటివి కామన్ విషయాలుగా మారిపోతున్నాయి. సంబంధాల్లో అయితే అలకలు, బ్రేకప్‌లు, విడాలకులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటికీ గల ప్రధాన కారణాల్లో మీలో లేదా ఎదుటి వారిలో క్షమాగుణం లేకపోవడం కూడా కారణమే అంటున్నారు నిపుణులు.

సాధారణంగా జరిగే చిన్న చిన్న పొరపాట్లను కామన్‌గా భావించి క్షమించేస్తే.. మీరు గానీ, అవతలి వ్యక్తులు గానీ పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. కొన్నిసార్లు అవతలి వ్యక్తి క్షమించమని మీకు మిమ్మల్ని అడగకపోయినా సరే.. సాధారణ విషయాల్లో జరిగే పొరపాట్లకే వారిపై కోపం, ప్రతీకారం వంటివి పెంచుకోవద్దు. ఇదంతా కామనే కదా అనుకుంటే చాలు.. మీరే క్షమించేస్తారు. పైగా ఇది మీలో ఆనందానికి కారణం, హ్యాపీనెస్ హార్మోన్లు రిలీజ్ అయ్యేలా ప్రేరేపించి పరక్షంగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా క్షమాగుణం మీలోని విజ్ఞతకు, విశాల దృక్పథానికి ప్రతిబింబంగా భావిస్తుంది సమాజం. అందుకే ‘ఫర్ గివ్‌నెస్ ఇచ్చే కిక్కే వేరు! ఇంకెందుకాలస్యం.. మనసులో ఏదీ పెట్టుకోకుండా క్షమించేసేయండి!!

Tags:    

Similar News