ఆయన సేవలను అందుకోని భారతీయుడు ఉండరు.. మెగా స్టార్ చిరంజీవి

దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు కన్నుమూశారు.

Update: 2024-10-10 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన మరణ వార్త యావత్ దేశాన్ని కలిచివేసింది. ఇక రతన్ టాటా మృతి పట్ల దేశంలోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార వేత్తలు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి రతన్ టాటాకు X వేదికగా సంతాపం తెలిపారు.

భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలుగా పలు రూపాల్లో రతన్ టాటా అందించిన సేవలను అందుకోని భారతీయుడు ఉండరు. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు, సమగ్రత, దృక్పథం ఎల్లప్పుడూ తరాలకు స్ఫూర్తినిస్తాయి, మార్గనిర్దేశం చేస్తాయని చిరంజీవి X వేదికగా పేర్కొన్నారు.


Also Read: ఎంతో మంది జీవితాలను మార్చేసిన దిగ్గజం : రతన్ టాటా మృతిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్

Tags:    

Similar News