ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న బుల్లితెర నటి.. వైరల్‌గా మారిన పోస్ట్
కన్నడ బుల్లితెర నటి మాన్సి జోషి(Mansi Joshi) ‘దేవత’ సీరియల్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
దిశ, సినిమా: కన్నడ బుల్లితెర నటి మాన్సి జోషి(Mansi Joshi) ‘దేవత’ సీరియల్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఢీ డ్యాన్స్ షోలో(Dhee Dance Show)నూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉండేది. తన హాట్ పిక్స్ షేర్ చేసి యూత్‌ను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, మాన్సీ ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభవార్తను అనౌన్స్ చేసింది.
అక్టోబర్ 20న ప్రియుడు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాఘవ(Raghava)తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుపుతూ ఫొటోలు షేర్ చేసింది. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ప్రజెంట్ మాన్సీ నిశ్చితార్థం పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.