స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం.. కిచ్చ సుదీప్‌కు మాతృవియోగం

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-10-20 07:00 GMT

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి సరోజ సంజీవ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఇన్ని రోజులుగా చికిత్స పొందుతున్న సరోజ నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా తన తల్లి అంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం అని బిగ్‌బాస్, ఇతర ఇంటర్వ్యూలు & వేదికలపై కిచ్చా సుదీప్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఎంతో ఇష్టమైన తల్లి కన్నుమూయడంతో స్టార్ హీరో కన్నీరుమున్నీరవుతున్నారు.


Similar News