విద్యుదాఘాతంతో మేకల కాపరి మృతి

విద్యుదాఘాతంతో మేకలు కాపరితో పాటు రెండు మేకలు మృతి చెందిన సంఘటన మండలంలోని జాజి తండాలోమంగళవారం జరిగింది.

Update: 2024-10-22 14:53 GMT

దిశ, కౌడిపల్లి: విద్యుదాఘాతంతో మేకలు కాపరితో పాటు రెండు మేకలు మృతి చెందిన సంఘటన మండలంలోని జాజి తండాలోమంగళవారం జరిగింది. తండావాసులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన కాట్రోత్ బుజ్జిభాయి(38) రోజు మాదిరిగా మేకలను మేపడానికి వెళ్ళింది. శ్రీరాముని గుట్ట సమీపంలో అదే తండాకు చెందిన పాతులోత్ శోభ వరి  పొలంలోకి వెళ్లాయి. సర్వీస్ వైర్ కేబుల్ తెగి పడడంతో కరెంట్ షాక్ గురై మేకలు మృతి చెందాయి. మేకలను వెతుక్కుంటూ కాట్రోత్ బుజ్జిభాయి వెళ్లి ఆమె కూడా కరెంట్ షాక్ కు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండావాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బుజ్జిభాయి మృతదేవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త సేవియా, ఇద్దరు కుమారులు అనిల్, భాస్కర్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. బుజ్జిభాయి మృతితో తండాలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.


Similar News