బిడ్డను కన్న నెల రోజులకే మళ్లీ షూటింగ్లో పాల్గొన్న స్టార్ హీరోయిన్.. ఆ బ్యూటీనే పాటిస్తోందిగా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా థీయేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కల్కీ2898ఏడీ’ మూవీలో నటించి మెప్పించింది. అయితే ఈ బ్యూటీ ఈ సినిమా టైంలో ప్రగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక గత నెలలో ఈ భామ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దీపిక- రణవీర్ దంపతులు ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. అయితే పాప ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే..?
సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే నెల రోజుల్లోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. భర్త రణవీర్ సింగ్‌తో కలిసి ఓ యాడ్ షూట్లో పాల్గొన్నారు. ఆ యాడ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు రణవీర్. ఇక దీపికా కీలక పాత్రలో నటించిన ‘సింగం ఎగైన’ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ భామ కెమెరా ముందుకు వచ్చేశారు కాబట్టి, వెంటనే నెక్స్ట్ మూవీ పట్టాలెక్కుతుంది. సో కెరీర్లో ఎలాంటి గ్యాప్ లేకుండానే తన లైఫ్‌లో బిగ్ చేంజ్‌కు ఈ భామ వెల్ కం చెప్పారన్నమాట. కాగా గతంలో ఆలియా భట్ కూడా తన ప్రెగ్నెన్సీ బ్రేక్‌ను ఇలాగే ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అలియా భట్‌ను ఫాలో అవుతున్న దీపికా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
(video link credits to ranveer singh instagram id)