BRS: ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ మరో వాయిదా తీర్మాణం

తెలంగాణలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) నేటితో ముగియనున్నాయి.

Update: 2024-12-21 04:52 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మరో వాయిదా తీర్మాణంతో ముందుకు వచ్చింది. ఇదివరకే లగచర్ల ఘటన సహా పలు అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) వాయిదా తీర్మాణాలను ప్రవేశపెట్టగా.. స్పీకర్(Speaker) తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ.. హైదరాబాద్ అభివృద్ధిపై(Hyderabad Devolepment) చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(BRS MLA Devoreddy Sudheer Reddy) ప్రతిపాదించారు. హైదరాబాద్ నగరంలో గత ఏడాది కాలంగా మౌళిక వసతుల కల్పనలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై చర్చకై వాయిదా ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు కావడంతో రైతు భరోసాపై చర్చ జరిపేందుకు ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేశారు. అంతేగాక నాలుగు బిల్లలకు ఈ రోజు సభ ఆమోదం తెలపనుంది. దీంతో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణం స్పీకర్ ఈ రోజు కూడా తిరస్కరించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News