TG Assembly: బీజేపీ, బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు.. సభలో ఆ అంశంపై చర్చకు పట్టు

ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి.

Update: 2024-12-21 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభంలోనే విపక్షాలు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP), సీపీఐ (CPI) పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎన్నికల సందర్భంగా మహిళలకు రూ.2,500 ఆర్ధిక సాయం, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electrical Scooters), కళ్యాణ లక్ష్మి (Kalyana Lakshmi) పథకం కింది తులం బంగారం (Gold) ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, ఆ అంశాలపై అసెంబ్లీ (Assembly)లో చర్చకు బీజేపీ (BJP) వాయిదా తీర్మానం (Adjournment Resolution) ఇచ్చింది.

అదేవిధంగా హైదరాబాద్‌ (Hyderabad)లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో సర్కార్ వైఫల్యంపై సభలో చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ (BRS) వాయిదా తీర్మానాన్ని అందజేసింది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంటాక్ట్ (Contract), ఔట్ సోర్సింగ్ (Out Sourcing) ఉద్యోగులకు ప్రైవేటు ఏజెన్సీ (Private Agency)లతో కాకుండా కార్పోరేషన్ (Corporation) ద్వారా శాలరీలు అందజేయాలని కోరుతూ సీపీఐ (CPI) వాయిదా తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేసింది. అయితే, అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. చాలా సమయం భూ భారతి బిల్లు (Bhu Bharathi)పై చర్చకు వెళ్లిపోయింది. దీంతో ఒక్క రోజు సమావేశాలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ సభలో రైతు భరోసా (Raithu Bharosa)పై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. 

Tags:    

Similar News