TG Assembly: అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు వస్తలేడు.. సీఎం రేవంత్ మాస్ ర్యాగింగ్
అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెటైర్లు వేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెటైర్లు వేశారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో రైతు భరోసా (Raithu Bharosa)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు (Raithu Bandhu)తో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతున్నారని.. అవన్ని ఉత్త మాటలేనని అన్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయంటూ గత పాలకులు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ (Telangana) దేశంలో రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు (కేసీఆర్) సభకు రావడం లేదని.. ఆ సంఘానికి ఉపాధ్యక్షుడు (హరీశ్ రావు) మాత్రమే సభకు వస్తున్నారని సెటైర్లు వేశారు.
రుణ మాఫీ విషయంలో బీఆర్ఎస్ (BRS) నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని.. ఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు పోయినా వారిలో మర్పు రావడం లేదని చురకలంటించారు. రూ.లక్ష రుణ మాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారని ఫైర్ అయ్యారు. అప్పట్లో రూ.లక్ష రుణం తీసుకున్న వారిపై రూ.80 వేల వడ్డీ భారం పడిందని తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్ల (ORR Tenders)తో చివరి నిమిషంలో రుణ మాఫీకి ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ (BRS) రూ.27 వేల కోట్లు రుణ మాఫీ కోసం ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.