Viral: పాము తల నుంచి బయటపడ్డ రాళ్లు.. ఎగబడి మరీ కొనుగోలు చేసిన రైతులు?
రైతుల ముందే ఒక పాము నుంచి రాళ్లను తీసి.. ఒక్కొక్క రాయిని
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య ఎవరి బిజినెస్ వారిదే.. వారి బిజినెస్ కు వారే రాజులుగా వ్యవహరిస్తున్నారు. ఇది రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళను మోసం చేస్తున్నారు. ప్రజల భయాన్ని కూడా కొందరు క్యాష్ చేసుకుని బతుకుతున్నారు. తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోసపూరితమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
కేశనపర్రు అనే ఒక ఊరిలో పాము ( Snakes) తల నుంచి రాళ్లను తీసి అంటూ రైతులుకు ( Farmers ) అమ్మేశారు. ఈ రాళ్లు మీ దగ్గరుంటే ఎలాంటి పాములు దగ్గరకు కూడా రావని జోరుగా ప్రచారం జరుగుతుంది. విష సర్పాలు కాటేసిన ప్రదేశంలో ఈ రాయి ఉంచితే ప్రాణ హాని కలగదని చెప్పి రైతులను, కూలీలను నమ్మించారు.
రైతుల ముందే ఒక పాము నుంచి రాళ్లను తీసి.. ఒక్కొక్క రాయిని 500 నుంచి 1000 కి అమ్మారు. ఈ పాములు, విష పురుగుల వారి వద్దకు రావని నమ్మి రైతులు ఎగబడి మరీ కొనేశారు. అయితే.. పాము తలలో రాళ్లు ఉండవని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. కావాలనే వారు ఆ రాళ్లు పెట్టి.. తల నుంచి తీసి మోసానికి పాల్పడ్డారని అనుమానాలు వస్తున్నాయి. పాము తలలో రాళ్లను చూపించి అమాయకులైన రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు కఠినంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.