Diabetes: ఇలాంటి పిల్లల్లో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!
ఇటీవల డయాబెటిస్ బారిన పడే జనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల డయాబెటిస్(diabetes) బారిన పడే జనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి (Insulin hormone level)తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజ(Uncontrolled metabolism)మే డయాబెటిస్(Diabetes). రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి(High glucose level) వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిగా మూత్రం(urine) వెళ్లడం (పాలీయూరియా), కారణం లేకుండా బరువు తగ్గడం, ఎక్కువగా దాహం వేయడం (పాలీడిప్సియా), బద్ధకం(laziness), చూపు మందగించడం(Blurred vision) డయాబెటిస్ లక్షణాలు.
ఇటీవల పిల్లల్లో కూడా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. పిల్లలలో డయాబెటిస్ ఇన్సిపిడస్(Diabetes insipidus) లక్షణాలు చూసినట్లైతే.. నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీపరీతమైన ఫీవర్ వస్తుంటుంది. మల విసర్జన(defecation) చేయడంలో ఇబ్బంది పడడం, అనూహ్యంగా వెయిట్ లాస్(Weight loss) అవ్వడం, వాంతులు చేసుకోవడం(Vomiting), పెరుగదల మందగించడం(Slowing down growth), రాత్రిపూట మూత్ర విసర్జన ఆధీనంలో లేకపోవడం(ఎన్యూరెసిస్) వంటి ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తుంటారు. మరీ ఎటువంటి పిల్లల్లో డయాబెటిస్ వస్తుందో ఓసారి చూద్దాం..
ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో వంశపారంపర్యంగా వచ్చే లక్షణాల కంటే జీవన శైలి ముఖ్యకారణంగా నిలుస్తుంది. పిల్లల్లో డయాబెటిస్ రావడానికి బయట ఫుడ్(outsideFood) ఓ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కాలం పిల్లలు ఇంట్లో ప్రిపేర్ చేసి ఫుడ్ కంటే బయట ఫుడ్ కే ఎక్కువ అలవాటు పడ్డారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోరిక మేరకు అడిగినవన్నీ కొనిస్తున్నారు.
అలాగే చదువాలంటూ, అన్నింట్లోనూ ముందు స్థానంలో ఉండాలని పిల్లల్ని ఒత్తిడి(stress) చేస్తున్నారు. చిన్నప్పుడే వారి గోల్ ఏంటో పేరెంట్సే నిర్ణయించి వారిని మానసికంగా(Mentally) ఇబ్బంది ఇబ్బంది కలిగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పదవ తరగతి చదివాక పిల్లల్లో డయాబెటిస్ కనిపించేదని అంటున్నారు. కానీ ఇప్పుడు నాలుగైదు చదివే పిల్లల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.
Read More...
Calcium deficiency: మహిళల్లో కాల్షియం లోపం.. తలెత్తే అనారోగ్య సమస్యలివే..?