చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన కల్లూరు మండల

Update: 2024-12-29 05:14 GMT

దిశ, కల్లూరు : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన కల్లూరు మండల పరిధిలోని ముగ్గు వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అక్కల వేంకటేశ్వర్లు (30) ఆదివారం తెల్లవారుజామున గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో చెరువు లోతు కి వెళ్లడం తో ప్రమాదవశాత్తు చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య బాబు, పాప ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News