ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే: ఎమ్మెల్సీ కవిత

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగి లో పండిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Update: 2022-04-10 05:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగి లో పండిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లను ఆదివారం ఎంపీలు, టీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ పై కేంద్రం అనుసరిస్తున్న వివక్ష వైఖరిని మానుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షం అని పేర్కొన్నారు. తెలంగాణలో యాసంగి లో వచ్చేది పారా బాయిల్డ్ రైస్ అని.. రా రైస్ రాదని తెలిసి కూడా కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సబబు కాదన్నారు.

తెలంగాణ రైతులపై అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగానే ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరిని విడనాడాలని సూచించారు. అదేవిధంగా ధర్నా ఏర్పాట్లను, ఫ్లెక్సీలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎంపీలు సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, పలువురు టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News