Location: ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లొకేషన్ షేర్ చేసే ఆప్షన్ వచ్చేసింది..!
సాధారణంగా మనం ఎటువైపు అయితే వెళ్లాలనుకుంటున్నామో రూట్ తెలియనప్పుడు లొకేషన్ పెట్టుకుని వెళ్తాం.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం ఎటువైపు అయితే వెళ్లాలనుకుంటున్నామో రూట్ తెలియనప్పుడు లొకేషన్ పెట్టుకుని వెళ్తాం. కామన్‌గా లొకేషన్‌ను ఇతరులకు వాట్సాప్‌లో షేర్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సన్నిహితులకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లొకేషన్ షేర్ చేయవచ్చు. ఇది గంట వరకు లైవ్ లొకేషన్ ఆన్‌లోనే ఉండటమే కాకుండా.. గమ్యం చేరుకున్నాక కూడా డిఫాల్ట్‌గా ఆఫ్ అవుతుంది. అలాగే ఓన్లీ మెసేజ్‌లో ప్రైవేట్ గా షేర్ అవుతుంది. కేవలం షేరింగ్ లొకేషన్ చాట్‌లోనున్న ఇద్దరికీ మాత్రమే కనిపిస్తుంది.
ఈ లొకేషన్ వేరే వారికి పంపించడానికి వీలుండదు. ఈ లైవ్ లొకేషన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేరింగ్ ప్రొగ్రెస్‌లో ఉందని.. పైన ఒక సింబల్ కనిపిస్తుంది. అలాగే మీరు ఏ సమయంలో అయితే లొకేషన్ షేరింగ్‌ను ముగించాలనుకుంటున్నారో అప్పుడే ఎండ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఈ ఫీచర్‌తో క్రికెట్ మ్యాచ్‌లు, కాన్సర్ట్‌లు, సభలు వటి ప్రదేశాల్లో మీ మిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు కూడా ఓ బెస్ట్ ఆప్షన్ ఉంది. ఇందుకోసం మ్యాప్‌లో ఒక లొకేషన్ పిన్ చేయాలి. ఈ ఫీచర్ పలు ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Read More...
Location: వాట్సాప్‌లోనే కాదు.. లొకేషన్ ఇలా కూడా షేర్ చేయొచ్చు