మంత్రి నా ఇంటిని అలా వాడుకున్నాడు.. 10 రోజులకు ఓసారి వచ్చి..

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ నియామకాల స్కామ్‌ కేసు దర్వాప్తులో సంచనల విషయాలు బయపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఈడీ విచారణలో నటి అర్పితా..

Update: 2022-07-27 09:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ నియామకాల స్కామ్‌ కేసు దర్వాప్తులో సంచనల విషయాలు బయపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఈడీ విచారణలో నటి అర్పితా.. విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ గురించి కీలక విషయాలు వెల్లడించింది. 2016 నుంచి పార్థా ఛటర్జీతో తనకు పరిచయం ఉన్నట్టు.. ఓ బెంగాలీ నటుడు తనను మంత్రికి పరిచయం చేసినట్టు ఆమె చెప్పుకొచ్చింది. తన ఇంట్లో దొరికిన రూ.21 కోట్లు మంత్రివేనని.. పార్థానే తన ఇంట్లో ఓ రూమ్‌లో డబ్బు దాచాడని చెప్పింది. అంతేకాకుండా తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా బ్యాంక్‌లా వాడుకుంటున్నారని ఆరోపించింది. తన ఇంట్లోని రూమ్‌‌కి కూడా పార్థా ఛటర్జీ మనుషులే సెక్యూరిటీగా ఉండేవారని.. వారు మాత్రమే రూమ్‌లోకి వెళ్లేవారని తెలిపింది. కాగా తన ఇంటికి పార్థా ఛటర్జీ 10 రోజులకు ఒకసారి వచ్చి వెళ్లేవాడని వెల్లడించింది. అయితే ఆ డబ్బంతా కాలేజీల రూపంలో వచ్చిన లంచం అని చెప్పింది. కాగా.. వీరిద్దరూ ఆగస్టు 3న ఈడీ కస్టడీలో ఉండనున్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకావాలు ఉన్నాయి.


Similar News