ఆ స్టార్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న లవ్ టుడే బ్యూటీ.. త్వరలో పెళ్లి కూడా.. (పోస్ట్)

ప్రస్తుత కాలంలో చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఉండే వారినే ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నారు.

Update: 2024-11-01 04:28 GMT

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఉండే వారినే ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అటు హీరోయిన్స్ అయినా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్టులైనా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఇలా ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఉండే వారిని సాధ్యమైనంత వరకు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎదురయ్యే పరిస్థితులు మగవారికి బాగా తెలుసు అనే కారణం ఒక ఎత్తైతే , ప్రేమించాము అనే కారణం మరో ఎత్తు. ఏదేమైనా ఇప్పుడు సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక స్టార్ డైరెక్టర్‌తో ప్రేమలో పడి వివాహానికి సిద్ధమవుతోందనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషా చిత్రాలలో వందలాదికి పైగా సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసిన రవీనా రవి(Raveena Ravi) చాలా మంది లేడీ సెలబ్రిటీలకు డబ్బింగ్ అందించింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేయడంతో పాటు పలు హిట్ సినిమాలలో కూడా నటించింది. ముఖ్యంగా లవ్ టుడే(Love Today), ఒరు కిదయిన్ కరుణైమను(Oru Kidayin Karunai manu) వంటి సినిమాలలో నటించిన ఈమె.. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ భామ మలయాళ దర్శకుడు దేవన్ జయకుమార్ (Devan Jayakumar)తో తన సంబంధాన్ని బహిర్గతం చేసింది. దేవన్ జయ కుమార్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఈ ఫొటో కింద.. “నస్వరమైన క్షణాల ప్రపంచంలో మేము శాశ్వతమైన దానిని కనుగొన్నాము. కలిసి మేము మా కథను రాసుకుంటాము” అంటూ ఒక అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు, ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(video link credits to raveena ravi instagram id)

Tags:    

Similar News