ఆ విషయంలో భార్యను అడ్డుకునే హక్కు భర్తకు లేదు.. హైకోర్టు కీలక తీర్పు
దిశ, వెబ్‌డెస్క్: పెద్దల సమక్షంలో పెళ్లి జరిగినప్పుడు భార్యపై భర్తకు అన్ని హక్కులు ఉంటాయని పూర్వీకులు అంటుంటారు..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: పెద్దల సమక్షంలో పెళ్లి జరిగినప్పుడు భార్యపై భర్తకు అన్ని హక్కులు ఉంటాయని పూర్వీకులు అంటుంటారు. ఈ క్రమంలోనే భార్యలపై ఆధిపత్యం చెలాయించడం సాధారణంగా మారిపోయింది. తాజాగా.. భార్య హక్కులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇటీవల కాలంలో ఎంతోమంది అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. తాము చనిపోయిన తర్వాత కనీసం ఒక్కరికైనా ప్రాణం పోయాలన్న ఉద్దేశ్యంతో అవయవ దానం చేస్తూ ఎంతోమందికి పునర్జన్మను ఇస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి సమయంలో పెళ్లైన మహిళలు అవయవదానం చేసేందుకు భర్తలు అంగీకారం ఇవ్వకపోవడం గమనార్హం. అయితే, ఇటీవలే ఓ వివాహిత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకుంది.
ఇందుకు భర్త అంగీకరించలేదు. అయితే, ఆసుపత్రి వర్గాలు ఈ శస్త్ర చికిత్స చేసేందుకు భర్త అంగీకారం తెలిపినట్లు ధ్రువీకరణ పత్రం కావాలని కోరారు. దీంతో సదరు మహిళ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు పెళ్ళైన మహిళ అవయవ దానం చేయడానికి ఆమె భర్త అంగీకారం అవసరం లేదంటూ తీర్పునిచ్చింది. భర్త అనుమతి కోరితే మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్లే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.