సర్కార్ జబర్దస్త్ స్కీమ్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోకి వచ్చిన నాటినుంచి వినూత్న పథకాలతో దూసుకెళ్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2022-03-28 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోకి వచ్చిన నాటినుంచి వినూత్న పథకాలతో దూసుకెళ్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల హావా నడుస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలను ప్రొత్సహించే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని బాలికల ఉన్నత చదువుల కోసం ముందడుగు వేశారు. 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న బాలికల ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా నెలకు రూ.1000 ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల మంది విద్యార్థినులు లబ్ధిపొందుతారని పేర్కొన్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

Tags:    

Similar News