ఆడపిల్ల పుట్టిందని హ్యాపీగా ఫీలైన తండ్రి.. పట్టరాని సంతోషంలో ఏం చేశాడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఆడపిల్ల పుట్టిందంటే కలతచెందే తండ్రులను మనం నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తుంటాం.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఆడపిల్ల పుట్టిందంటే కలతచెందే తండ్రులను మనం నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తుంటాం. కానీ, ఓ తండ్రి ఆడపిల్ల పుట్టిందని హెలికాప్టర్లో గ్రాండ్ వెల్ కమ్ చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణేలోని షెల్గాన్ గురించి ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటుంది. దీనికి ప్రధాన కారణం ఆడపిల్ల పుట్టడం. జనవరి 22న భోరసా పట్టణంలో విశాల్ జరేకర్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. దీంతో పట్టరాని ఆనందంలో ఉన్న తండ్రి పాపను అత్తగారింటి నుంచి తన ఇంటికి తీసుకొచ్చేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకొని, ఆ హెలికాప్టర్లో పాపను ఇంటికి తీసుకొచ్చి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పాడు. ఈ సందర్భంగా తండ్రి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా మా ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టలేదు. ఇప్పుడు పాప పుట్టడం చాలా సంతోషంగా ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవీ పుట్టిందని ఫీల్ అవుతున్నాను. అని ఆ తండ్రి అభిప్రాయపడ్డారు. కాగా, హెలికాప్టర్లో కూతురికి తండ్రి వెల్కమ్ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.