రాజ్యాంగాన్ని అవమానించే వారిపై కేసులు నమోదు చేయాలి

దిశ, పాలమూరు: రాజ్యాంగాన్ని అవమానించే - The constitutional defense initiation ceremony was held in Mahabubnagar district

Update: 2022-03-15 17:19 GMT

దిశ, పాలమూరు: రాజ్యాంగాన్ని అవమానించే వారు ఏ స్థాయిలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి అధ్యక్షతన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగ రక్షణ దీక్షా కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జాతీయ కార్యదర్శి బైరి రమేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత హర్షవర్ధన్ రెడ్డి, పండుగ సాయన్న సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జి టి కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబుల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానపరిచిన విధంగా మాట్లాడాలని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు రాజ్యాంగాన్ని అవమానపరిచిన విధంగా ఎవరు మాట్లాడినా చట్టపరమైన చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 25న రాజ్యాంగ పరిరక్షణ కోసం హైదరాబాద్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలి రావాలని నేతలు విజ్ఞప్తి చేశారు.


కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత బాబుల్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నేతలు గోలి సైదులు, ఉదండపురం సత్యనారాయణ, శ్రీ రాములు, దారా సత్యం, సామల అశోక్, తుమ్మల రవి కుమార్, ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు పారుపల్లి శేఖర్, ఎం శ్రీనివాస్, పూలే దశరథం, పర్వతాలు, నేతలు శంకర్ బాబు, నిర్మల, చింత సత్తి, శ్రీనివాస్, మహేష్, నిరంజన్, రాజు, కురుమయ్య, కృష్ణ, రాయప్ప, రజినీకాంత్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News